Benefits of Tulsi  తులసి ఉపయోగాలు

Benefits of Tulsi తులసి ఉపయోగాలు

• తులసి మొక్కలు నోటిపూత, నోట్లో అల్సర్స్, ఇతర ఇన్‌ఫెక్షన్ల నివారణకు ఎంతో ఉపకరిస్తుంది.
• ప్రధానంగా చిన్నపిల్లల్లో తరచూ వచ్చే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులకు ఇది ఉపకరిస్తుంది.
• తులసి ఆకులను డికాషన్‌గా తీసుకుని తలనొప్పిని దూరం చేసుకోవచ్చు.
• తులసి ఆకులను ఎండబెట్టి, వాటిని పొడి చేసి, దాంతో పళ్ళు తోముకుంటే దంత రక్షణకు మేలు చేస్తుంది. దీన్ని ఆవనూనెలో కలిపి టూత్‌పేస్ట్‌లా వాడుకుంటే దంతక్షయంతోపాటు నోటి దుర్వాసన పోయి, పళ్ళు అందంగా తయారవుతాయి.
• రోజూ ఒక తులసి ఆకు తింటే నాడులకు టానిక్‌లాగా, జ్ఞాపకశక్తిని పెంపొందించే శక్తిగా పని చేస్తుంది.
• వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరీ ఎక్కువగా ఉంటే తులసి ఆకులనూ, యాలకుల పొడినీ కలిపి అరలీటరు నీళ్లలో మరిగించి కషాయంలా తయారు చేసి అందులో చక్కెర, పాలు కలిపి తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది.
• బ్రాంకైటిస్‌, ఆస్థమాల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.
• ప్రతిరోజు ఐదారు ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. కడుపులో నులి పురుగు నశిస్తుంది.
• ఎండిన తులసి ఆకులను కీటకాలను దూరంగా ఉంచడం కోసం ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉంచుతారు.
• ఆకుల రసం (పసరు)గా, ఎండిన ఆకుల పొడిగా, హెర్బల్ టీగా, నేతిలో మరగ పెట్టడం ద్వారా… ఇలా తులసిని వివిధ రూపాల్లో తీసుకోవచ్చు.
• తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి ఉండటంతో డయాబెటిస్ ఉన్న వారికి చక్కగా పనికొస్తుంది.
• రెండు స్పూనుల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది.
• తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.
చూశారు కదా తులసి ఉపయోగాలు మరి రోజు కనీసం మూడు తులసి ఆకులను అందరు తినండి, ఈ రోజు శుక్రవారం, మంగళవారం తులసి ఆకులను తుంచాలా వద్ద అని ఆలోచించకండి। కరోనా లాంటి భయంకర వైరస్ రాకుండా కొంతవరకు తులసి ఆకులు కాపాడుతాయి। తులసి ఆకుల నుండి తీసిన రసం కూడా ఆయూర్వేది షాపుల్లో మీకు దొరుకుతుంది, వాటిని మనం తాగే నీటిలో ఒక్క డ్రాప్ వేసుకుంటే చాలు.

దగ్గు తగ్గడానికి అద్భుతమైన ఓషదం నాలుగు సంవత్సరాలు నిండిన పిల్లలకు కూడా ఇవ్వవచ్చు

  • సూచన : మోతాదును ఆయుర్వేదిక వైద్యుల సలహా మేరకు వాడగలరు

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *