చక్రాసనము Chakrasana

చక్రాసనము Chakrasana

చక్రాసనము (సంస్కృతం: चक्रासन) యోగాలో ఒక విధమైన ఆసనము. ఈ ఆసనం చక్రం ఆకారంలో ఉంటుంది కనుక దీనికి చక్రాసనమని పేరువచ్చింది.

పద్ధతి

మొదట వెల్లకిలా పడుకోవాలి.

తరువాత కాళ్ళు మడిచి, చేతులను భుజాల కిందుగా ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి కుంభించి నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. మెడ కిందికి వేలాడుతుండాలి.

కొద్ది క్షణాలు ఈ స్థితిలో ఉన్న తరువాత మెల్లమెల్లగా తలను నేలపై ఆనించి నడుమును గూడా ఆనించాలి.

దీని తర్వాత కొద్ది క్షణాల సేపు శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి.

సూచన

ప్రారంభదశలో తలను నేలపైననే ఆనించి అర్థ చక్రాసనం అభ్యాసం చేయవచ్చును. చేతులపై శరీరం బరువును ఆపగలమన్న ధైర్య కలిగేవరకు తల ఆనించి అభ్యాసం కొనసాగించవచ్చును.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *