శొంఠి – Dry Ginger  {మహాఔషధీ }

శొంఠి – Dry Ginger {మహాఔషధీ }

శొంఠి – Dry Ginger {మహాఔషధీ }


    పచ్చిదుంపను 'అల్లం' అనీ, ఎండించిన దుంపను 'శొంఠి' అని అంటారు. 

జీర్ణ శక్తిని పెంచును. కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది.

దగ్గు, ఆయాసము, వాంతిని, గుండె జబ్బులను తగ్గిస్తుంది.

మూలవ్యాధి, కడుపుబ్బరము, కడుపునొప్పి, మలబద్ధకంను తగ్గిస్తుంది.
వీర్యవృద్ది చేయును.

జిగురు, రక్తవిరోచనాలు:

  శొంఠిని రాత్రి దేశవాళి చిక్కటి ఆవు మజ్జిగలో నానబెట్టి ఉదయం ఆ మజ్జిగతోనే ఆ శొంఠిని నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి 1-2 మాత్రలు ఉదయం, సాయంత్రం వాడాలి. 

తలనొప్పి: శొంఠిని గంధము వలేనూరి కణతలకు పట్టువేసినా తలనొప్పి, పార్శ్వపు తలనొప్పి తగ్గును.

కీళ్ళనొప్పులు: శొంఠి 5 గ్రాములు ఒక గ్లాసు నీటిలో వేసి పావు గ్లాసు మిగిలేలా మరిగించి 10-15ml ఆముదం కలిపి ఉదయం, సాయంత్రం తాగాలి.

మోతాదు: చూర్ణం: 3 గ్రాము

మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం
బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు
పసి పిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదులో దీనిని వాడుతారు. ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది.

ఇది ఆకలిని పెంచుతుంది.జీర్ణ రసాలు ఊరడాన్ని ప్రేరేపిస్తుంది. ఆకలి తక్కువగా ఉన్నవారు చిన్న అల్లం ముక్కకు ఉప్పు అద్ది దాన్ని నమిలితే ఆకలి పుట్టును.

అల్లం ప్రయాణంలో ఉన్నపుడు కలిగే6 వికారాన్ని తగ్గిస్తుంది.
కొన్ని వేల సంవత్సరాలనుండి అల్లంను జలుబు మరియు ఫ్లూ చికిత్స కోసము వాడుతున్నారు.
అల్లం టీ తగడము వలన అజీర్తి తగ్గుతుంది.

అల్లం పొడి అండాశయ క్యాన్సర్ కణాల్లో కణ మరణాన్ని ప్రేరేపిస్తుంది.

అల్లం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

మిన్నెసోటా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం అల్లం కొలరెక్టల్ క్యాన్సర్ కణాలు వృద్ధిని తగ్గిస్తుంది. అందువలన ఇది పెద్దప్రేగు క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది.

గర్భిణీ స్త్రీలలో తలతిరుగడం, వికారము మరియు వాంతులు ఎక్కువగా ఉంటాయి. అల్లం తినడము వలన బాగా ఉపశమనం కలుగుతుంది.

అల్లం మనకందరికీ సుపరిచితమైన ఔషధి


ఆయుర్వేదం ప్రకారం మరికొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం. 

 • జింజరాల్ , బీటాకెరోటిన్‌, క్యాప్సైసిన్‌, కెఫీక్‌ ఆమ్లం, కురుక్యుమిన్‌, శాలిసిలేట్‌ తదితర యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంవల్ల అల్లం కండరాల నొప్పుల్నీ ఆస్టియో ఆర్థ్రయిటిస్‌ కారణంగా వచ్చే మంటల్నీ తగ్గిస్తుందని జార్జియా నిపుణులు చెబుతున్నారు. వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీమర్స్‌ వంటి వ్యాధుల్నీ ఇది నివారిస్తుందట. ఇందుకోసం 60 దాటిన మహిళలకు రోజూ కాస్త అల్లంరసం ఇవ్వడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగైనట్లు తేలింది.

జీర్ణక్రియ 
చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ జీర్ణక్రియ సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాని కోసం ఎందరో వైద్యుల్ని కలుస్తున్నారు, ఎన్నో మందులు మింగుతున్నారు. కానీ తల్లి లాగా సేదతీర్చే చక్కని ఔషధం అల్లం ఉందన్న విషయం మరిచిపోయాం. అల్లం రసం జీలకర్ర, వాము కలిపి ప్రతిదినం తీసుకున్నట్లయితే భయంకర మైన జీర్ణాశయ వ్యాధులు కూడా దూరం అవుతాయి. 
అల్లం లవణ భాస్కరం (ఒక రకమైన ఉప్పు) కలిపి తింటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. 
అల్లం బెల్లం నెయ్యి కలిపి వేడిచేసి నాకుతూ ఉంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. 
తలనొప్పి జలుబు 
గంధం లాగా పొడి అల్లం పట్టు వేయడం వలన చాలా ఉపశమనం కలుగుతుంది. 
జలుబు దగ్గు 
అల్లం రసం రోజుకు 5మార్లు తీసుకోవడం వలన చాల వరకు ఉపశమనం కలుగుతుంది. 
పసి పిల్లలకు పాలు వేడీచేసి అల్లం పొడి కలిపితే చాలా మంచిది. 
కీళ్ళనొప్పులు, విరేచనం వల్ల ఇబ్బంది పడుతున్నవారికి అల్లం పసుపు 1గ్లాసు వేడినీళ్లతో కాచి కషాయం త్రాగడం వల్ల చాలా వరకు తగ్గును. 

అల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నది మనకు తెలిసిందే. ముఖ్యంగా వూబకాయం, మధుమేహం, హృద్రోగం… వంటి వాటిని అల్లం నిరోధిస్తుంది. బరువును తగ్గించేందుకూ దోహదపడుతుంది. 45 రోజులపాటు 85 మందికి రోజూ మూడు గ్రాముల అల్లంపొడిని ఇవ్వగా వాళ్లలో చెడు కొలెస్ట్రాల్‌ బాగా తగ్గినట్లు గుర్తించారు. పేగుక్యాన్సర్‌ వచ్చే అవకాశాన్నీ తగ్గిస్తుందిది. ఇందులోని ఫినాలిక్‌ పదార్థాలు పేగు పనితీరుని మెరుగుపరుస్తాయి. లాలాజలగ్రంథుల్నీ ప్రేరేపిస్తాయి.

 • పచ్చి అల్లంముక్కను నమిలినా లేదా కాసిని నీళ్లలో మరిగించి తాగినా వికారం తగ్గుతుంది. క్యాన్సర్‌ రోగుల్లో వచ్చే వికారానికి ఇది బాగా పనిచేస్తుంది. చల్లని వాతావరణంలో అల్లం టీ తాగడంవల్ల అది శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది.
 • అల్లం నెలసరి నొప్పికి రోజుకి 2 గ్రాముల అల్లంపొడిని వరసగా మూడురోజులపాటు ఇస్తే నొప్పి తగ్గినట్లు తేలింది.
  అల్లంలోని జింజరాల్‌వల్ల ఇన్ఫెక్షన్లూ త్వరగా రావని నిరూపితమైంది
  ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *