Fenugreek మెంతులు

Fenugreek మెంతులు

మళ్ళీ పోపుల డబ్బాలోకి దూరుదాం. ఈ సారి ఇంగ్లీష్ లో ఫెనూగ్రీకనే మన మెంతులు.

మెంతులు తెలియని వారు ఉండరు. ప్రతీ వంటగదిలో తప్పకుండా ఉండే వస్తువు ఇది. మెంతి పొడిని పప్పుల్లో, పులుసుల్లో, పచ్చళ్లలో కలుపుతారు. అలాగే మెంతి కూర (ఆకు కూర) ను కూడా పప్పు, కూరలలో వాడుతూ ఉంటారు. మెంతులు పసుపు రంగులో ఉంటాయి. మంచి సువాసనను కలిగి ఉంటాయి. మెంతులను వేయించినప్పుడు ఇంకా చక్కని సువాసన వస్తుంది. అయితే మెంతులు చేదుగా ఉంటాయి. అందువల్ల వంటకాలలో తక్కువ మోతాదులో వాడతారు.

మెంతులను ఇంగ్లీష్ లో ‘ఫెన్యుగ్రీక్’ అనీ, హిందీలో ‘మేథీ’ అని, తమిళంలో ‘వెంద్యం’ అనీ, మలయాళంలో ‘ఉలువ’ అనీ, కన్నడంలో ‘మెంతే’ అనీ, పంజాబీలో ‘మెత్’ అనీ, మరాఠీలో ‘మేతి దానే’ అని మరియు బెంగాలీలో ‘మేథీ’ అనీ అంటారు.
మెంతులలో పీచు పదార్ధం సమృద్ధిగా వుంటుంది. మెంతి ఆకుల్లో ఇనుము ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. అంతేకాక యాంటీ యాక్సిడెంట్స్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

మెంతులలో పీచు పదార్ధం సమృద్ధిగా వుంటుంది. మెంతి ఆకుల్లో ఇనుము ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. అంతేకాక యాంటీ యాక్సిడెంట్స్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

మెంతులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే తరతరాలుగా మెంతులను జుట్టు పెరగడానికి కండిషనర్ గా వాడుతున్నారు. కానీ క్రొత్తగా పరిశోధనల్లో అవి ఇంకా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయని తెలిసింది. వంటకాలకు సుగంధాన్నిచ్చే ఈ మెంతులు ఆరోగ్యానికీ, చర్మానికీ, జుట్టుకూ కూడా ఎన్నో విధాల సహాయపడతాయి.

ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి జీర్ణ సమస్యలు, మధుమేహం, బాధాకరమైన రుతుస్రావం, మెనోపాజ్,, ఆర్థరైటిస్, థైరాయిడ్ సమస్య, అధిక రక్తపోటు వంటి గుండెను ప్రభావితం చేసే పరిస్థితులపై కూడా ఉపయోగపడుతుంది. ఇవే కాక ఇవి జుట్టుకు, చర్మానికీ కూడా ఎంతో మేలు చేస్తాయి.

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు తరచూ మెంతులను వాడమని సలహా ఇస్తారు ఎందుకంటే దీనిలో మధుమేహాన్ని నియంత్రణ చేసే శక్తి ఉంది. మెంతులకు టైప్ 2 డయాబెటిస్ ను తగ్గించే గుణం ఉందని అధ్యయనాల్లో తేలింది. రాత్రి ప
పూట ఓ రెండు చెంచాల మెంతులు ఓ గ్లాసు నీటిలో వేసి , మరునాడు పొద్దున్నే పరగడుపున ఆ నీరు తాగితే‌ , సుగరు జబ్బు నియంత్రణ లో వుంటుంది.

మెంతులలో నారింజనీన్ అనే ఫ్లవనాయిడ్స్ ఉండటం వల్ల అది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది.

మెంతులు గుండెలోని రక్తనాళాల పనితీరును మెరుగు పరుస్తుంది. గుండెపోటు రావడానికి ముఖ్యమైన కారణం గుండె కవాటాలు మూసుకుపోవడం. అయితే ఒకవేళ అప్పటికే కొంత హాని జరిగినా మెంతుల వల్ల ఇకపై గుండెకు హాని జరగకుండా కాపాడుతుంది్.

మెంతులలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఆర్థరైటిస్ తో బాధపడేవారికి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని పరిశోధనల్లో తేలింది. అందువల్ల మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు మెంతులను తీసుకోవడం వల్ల ఆ నొప్పుల నుండి చాలా వరకు తేరుకుంటారు.

మెంతులు గ్యాస్ట్రిక్ ఇబ్బందులకు, మల బద్ధకానికి,, కడుపులో వచ్చే అల్సర్లకు అద్భుతమైన మందు. దీనిలోని సహజమైన జీర్ణ శక్తిని పెంపొందించే అంశాలు జీర్ణాశయాన్నీ, ప్రేగుల పనితీరునూ మెరుగుపరుస్తాయి.

మెంతులు కాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడడానికి ఎంతో ఉపయోగపడతాయని అధ్యయనాల్లో తేలింది . మెంతులలో యాంటీ కాన్సర్ గుణాలు ఉండటం వల్ల వీటిని తీసుకొనే వారిలో కాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే శక్తి పెంపొందుతుంది.

ఈ మెంతులలో తల్లిపాల ఉత్పత్తికి కారణమయ్యే ఫైటోఈస్ట్రోజెన్ ఉండటం వల్ల పాలిచ్చే తల్లులలో ఇది పాల సామర్ధ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది . మెంతులతో చేసిన టీ ని త్రాగడం వల్ల ఈ ఉపయోగాన్ని పొందవచ్చు. అంతేకాక పసి పిల్లలు చక్కగా ఆరోగ్యంగా బరువు పెరగడానికి తోడ్పడుతుంది.

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మెంతులను మీ డైట్ మెనూ లో తప్పక చేర్చండి. మీరు తినే ప్రతీ పదార్థంలోనూ మెంతులను లేదా మెంతిపొడిని చేర్చండి. దానివల్ల మీ మెటబాలిజం మెరుగుపడుతుంది.

అంతే కాక, మెంతులు శరీరంలో క్రొవ్వు పేరుకుపోకుండా చేసి, గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి, బరువు తగ్గడంలో సహాయపడతాయి.

మెంతులను ఉడకబెట్టి, పేస్ట్ చేసి ఆ పేస్ట్ ను రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులోనికి వస్తుంది.

మెంతులు ప్రభావవంతంగా మొటిమలను తగ్గిస్తాయి. నాలుగు టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నానబెట్టి, నాలుగు కప్పుల నీటిలో 15 నిమిషాలు ఉడికించి చలార్చాలి. తర్వాత నీటిని వడకట్టి, ఆ నీటిలో దూదిని ముంచి ఆ నీటిని మొటిమలపై అద్దాలి. (మిగిలిన నీటిని రిఫ్రిజిరేటర్ లోనిల్వ ఉంచవచ్చు.)

మెంతులు మూలాల నుండి జుట్టును బలోపేతం చేస్తుంది. ఫొలిక్యులర్ సమస్యలకు చాలా సమర్థవంతంగా చికిత్స చేస్తుంది.

సీసాను తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులను, ఒక కప్పు కొబ్బరి నూనెలో కలిపి ఎండ తగలని ప్రదేశంలో మూడు వారాలపాటు ఉంచాలి. ఆ తర్వాత ఆ నూనెను తలపై మర్దనకు వాడాలి.

మెంతులు జుట్టుకు మెరుపునిస్తాయి మరియు మృదువుగా చేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల మెంతులను, ఒక కప్పు మరిగిన నీళ్లలో వేసి బాగా కలిపి రాత్రంతా నాననివ్వండి. గింజలు మెత్తబడ్డాకా ఆ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్ లా చేసి జుట్టుకు పట్టించి అరగంట అలానే వదిలేసి తర్వాత కడిగేయండి.

మెంతులలో లెసిథిన్ ఉంటుంది. నానబెట్టడం వల్ల మెంతులలో వచ్చే జిగురు పదార్ధం జుట్టును మృదువుగా పట్టులా మెసిసేలా చేస్తుంది.

మెంతులను రాత్రంతా నానబెట్టి ఆ నీటిని పరగడుపున తాగటం వల్ల ఎన్నో లాభాలున్నాయి.
మెంతులు నానబెట్టిన నీటితో జుట్టును తడిపి 10 నిమిషాలు వదిలేసి ఆపై కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది.

మెంతులను పొడిగా అన్ని ఆహార పదార్ధాలపైనా చల్లితే ఆ పదార్ధాలకు రుచిని ఇవ్వడమే కాక మెంతుల గుణాలు శరీరానికి అంది ఆరోగ్యం పెంపొందుతుంది.

మెంతులతో టీ కూడా చేసుకోవచ్చు.

దుష్ఫలితాలు:

మెంతులను గర్భిణీ స్త్రీలు తినడం అంత మంచిది కాదు దాని వల్ల ముందుగానే డెలివెరి అయ్యే ప్రమాదం ఉంది (20). డెలివరీకి ముందు మెంతులు తింటే శిశువు నుండి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *