చుండ్రును పోగొట్టాలంటే –  Get Rid of Dandruff

చుండ్రును పోగొట్టాలంటే – Get Rid of Dandruff

బాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు, చర్మ వ్యాధుల వల్ల చుండ్రు వస్తుంది. తలలో దురద, అకారణంగా జుట్టు రాలిపోవటం దీని ప్రధాన లక్షణాలు. ఆదిలోనే చుండ్రు విషయాన్ని తెలుసుకుని పరిష్కారం చేసుకోవాలి. చుండ్రును సమర్ధవంతంగా ఎదుర్కొనే సులభ ప్రక్రియలు మీ ఇంటి వద్దే ఆచరించండి.
* పుల్లటి పెరుగును రాగి పాత్రలో
6 రోజులు ఉంచి బాగాకలిపి తలకు పెట్టి 5 నిముషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసి ఆరిన తర్వాత ఆయుర్వేద తైలం మర్దించుకోవాలి.

*.మందారం ఆకులను మెత్తగా నూరి, కుంకుడుకాయ రసంలో కలపాలి. దీన్ని వారానికి రెండుసార్లు తలకు బాగా మర్దించి 5 నిముషాల తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. దీని వల్ల తలలో ఉండే దురద, చుండ్రు తొలగిపోతాయి. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.

*. రేగు ఆకులను మెత్తగా నూరి, కుంకుడు కాయల రసంలో కలిపి తలంటుకుంటే జుట్టురాలటం తగ్గి చుండ్రు వదిలిపోతుంది.

*.గరికగడ్డి రసంలో కొద్దిగా ఉల్లి రసం కలిపి తరచూ తలకు పట్టిస్తే గుణం కనిపిస్తుంది.

*.కలబంద గుజ్జుతో తలంటుకుంటే త్వరగా చుండ్రు సమస్య పోతుంది.

*.నల్ల తులసి రసంలో కొద్దిగా బేకింగ్‌ సోడా, నిమ్మరసం కలిపి తలకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత స్నానం చేస్తుంటే జుట్టు రాలడం, చుండ్రు తగ్గిపోయి జుట్టు నల్లగా పెరుగుతుంది.

*.తమలపాకు రసం తీసి కొద్దిగా పసుపు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తల స్నానం చేస్తే చక్కని ఫలితం కలుగుతుంది.
*.ఉమ్మెత్తాకురసం తీసి కొద్దిగా పసుపు కలిపి తలకు పట్టించి స్నానం చేయాలి.

*.కొబ్బరి పాలను తలకు బాగా పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు వదిలిపోతుంది.

*. నిమ్మరసంలో కొద్దిగా బేకింగ్‌ సోడా కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి, కాసేపయ్యాక తలస్నానం చేయాలి. దీని వల్ల దురద తగ్గుతుంది.

*.తరచూ ఉసిరికాయ కషాయాన్ని తలకు మర్దనా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

*. వేపాకు రసంలో కొద్దిగా పసుపు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల త్వరగా దురద తగ్గిపోతుంది. చుండ్రు మటుమాయం అవుతుంది.
ఇతర చర్మవ్యాధులు తగ్గిపోయి జుట్టు పెరుగుతుంది.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *