సొరియాసిస్‌- Psoriasis

సొరియాసిస్‌- Psoriasis

సొరియాసిస్‌-psoriasis


తరచుగా వస్తూపోయే దీర్ఘకాల చర్మవ్యాధి. ఇది శరీరకంగా, మానసికంగా బాధిస్తుంది. వాస్తవాకి ఇది వ్యాధికాదు. వంశపారంపర్యంగా శరీరంతత్వంలో ఏర్పడిన అలజడి మాత్రమే. వేల సంవత్సరాల చరిత్రఉన్న ఈ వ్యాధిని ఆయుర్వేద గ్రంథాల్లో కిటిభ అన్నారు. ఆలివ్‌ నూనెతో ఏసుక్రీస్తు కూడా ఈ వ్యాధికి చికిత్స చేసినట్లు బైబిల్‌ లో ఉంది. ప్రపంచజనాభాలో దాదాపు మూడు శాతం సొరియాసిస్‌ వ్యాధిగ్రస్తులే. 
వ్యాధికి కారణాలు : యాభైశాతం రోగుల్లో ఈ వ్యాధి వంశపారంపర్యమే. అయితే ఇది అంటువ్యాధికాదు. సైనసైటిస్‌, బ్రోంకైటిస్‌, ఆస్మా, టి.బి మొదలైన ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధులు, గర్భధారణ, గర్భస్రావం, మానసిక ఒత్తిడి, ఆధునికవైద్యంలో విరివిగా ఉపయోగిస్తున్న స్టెరాయిడ్లు, మలేరియా జ్వరంలో రక్తపోటు, గుండెజబ్బుల్లోను వాడే కొన్ని ఔషధాలు సొరియాసిస్‌ తీవ్రతరం కావటానికి కారణాలుగా గుర్తించారు. 
వ్యాధి లక్షణాలు :
ప్రారంభంలో సొరియాసిస్‌ తలలో చుండ్రుగానూ, శరీరంపై చిన్నచిన్న పొక్కులు మొదలై దురదతో కూడి ఇతర శరీరభాగాల్లో దళసరి నల్లని మచ్చలుగా ఏర్పడుతుంది. ఈ మచ్చలు వెండిలా తెల్లగా మెరిసే చేప పొలుసుల్లా కప్పబడి ఉంటాయి. గోళ్లపై చిన్న చిన్న గుంటలు ఏర్పడి, చివరికి గోళ్లు పుచ్చిపోయి అందవికారంగా మారతాయి.
ఒక్కోసారి ఈ వ్యాధి ప్రారంభంలో ఏ మందులు వాడకున్నా తగ్గుతుంది. అలాగని అశ్రద్ధ చేస్తే ఒక్కసారిగా ఈ వ్యాధి దాడి చేసి జీవితాంతం మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నమ్మకం, పట్టుదల, సహనంతో ఎక్కువకాలం మందులు వాడి సొరియాసిస్‌ని అదుపుచేయవచ్చు. మనం నిత్యం చూసే పెరటిమొక్కలు సొరియాసిస్‌ వ్యాధి ప్రారంభదశలో అదుపుచేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

కామంచి రసం
కావాల్సిన పదార్థాలు : కామంచి ఆకులు
తయారీవిధానం : కామంచి మొక్కని కామాక్షి, గాజుచెట్టు అని కూడా పిలుస్తారు. మొదట కామంచి ఆకులతో రసాన్ని తయారుచేసుకోవాలి. ఈ రసాన్ని గిన్నెలో పోసి సన్ననిమంటపై మరిగిస్తుంటే కొద్దిసేపటికి రసం ముద్దలు ముద్దలుగా విడిపోతుంది. ఈ ముద్దలు కలవకుండా జాగ్రత్తగా వడపోసి ఈ రసాన్ని రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మూడు టేబుల్‌ స్పూన్ల చొప్పున తాగాలి. శరీరంపైనా ఈ రసాన్ని రాసుకోవచ్చు. ఇలా క్రమంగా కొన్నాళ్లు చేస్తే సొరియాసిస్‌ అదుపులోకి వస్తుంది.
కసివింద మిశ్రమం

కావాల్సిన పదార్థాలు- కసవింద ఆకులు, వేర్లు 
తయారీవిధానం – రోడ్డు పక్క, పొలాల గట్లపై దొరికే కసివింద ఆకులతో రసాన్ని చేసుకోవాలి. లేదా వేర్లతో కూడా రసాన్ని చేసుకోవచ్చు. ఈ కసవింద రసాన్ని శరీరంలో సొరియాసిస్‌ ఉన్నచోట రాసుకోవాలి. ఈ ఆకు పచ్చడిగానూ, గింజలు కారంపొడిగా కొట్టి రోజూ ఆహారంలో తీసుకున్నా చాలా మంచిది. సొరియాసిస్‌ని అదుపులో ఉంచవచ్చు.
కుప్పింటి మిశ్రమం 

కావాల్సిన పదార్థాలు : కుప్పింటి ఆకులు
తయారీవిధానం : కుప్పింటి ఆకునే హరితమంజరి అని పిలుస్తారు. వారానికి ఒరోజు ఈ ఆకులతో కూర చేసుకుని అన్నంలో తినాలి. దీనివల్ల ఉదయాన్నే కాలవిరేచనం అయ్యి సొరియాసిస్‌ వ్యాధి త్వరగా అదుపులోకి వస్తుంది. ఈ ఆకురసాన్ని పూతగా కూడా రాసుకోవచ్చు.
ఇక పలు మొక్కలతో సొరియాసిస్‌ని అదుపుచేసే ఓ పొడి తయారు చేసుకుంటే చాలా మంచిది. అదెలాగో తెల్సుకుందాం.

నాలుగు ఆకుల మిశ్రమం

కావాల్సిన పదార్థాలు :ఉత్తరేణి, కామంచి, కుప్పింటి, మల్చరీ ఆకులు, మిర్యాలు


తయారీవిధానం : ఉత్తరేణి, కామంచి, కుప్పింటి, మల్బరీ ఆకులను నీటిలో శుభ్రంగా కడగాలి. తర్వాత నీడలో ఆరబెట్టి పొడిచేయలి. ఈ పొడికి నాలుగోవంతు మిర్యాల చూర్ణాన్ని కలపాలి. రోజూ చెంచాడు ఈ ఆకుపొడిని గ్లాసు మజ్జిగలో కలిపి తాగాలి. లేకుంటే రోజువారి ఆహారంలో కూరలు, పచ్చళ్లు, పొడుల రూపంలో కూడా తినటం చాలా మంచిది.
ఈ సొరియాసిస్‌ వ్యాధి ఉన్న వారు ఎలాంటి సబ్బులను వాడరాదు. ఇంట్లో చేసుకున్న సున్నిపిండితోనే స్నానం చేసుకోవాలి. అనివార్య పరిస్థితిలో పిల్లలకు వాడే బేబీ సబ్బులు వాడవచ్చు.

ఈ వ్యాధి ఉన్న వారు వేసవికాలంలో ఆలివ్‌ నూనె,
శీతాకాలంలో నువ్వుల నూనె రాసుకోవటం ఉత్తమం
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *