*బీరకాయ(ridge gourd)తో ఎన్నో లాభాలు..!?*

*బీరకాయ(ridge gourd)తో ఎన్నో లాభాలు..!?*

*షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది*

*తాగుబోతులకి సంజీవని బీరకాయ.!*

*ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న కాలేయ రక్షణ*

*అల్సర్లు, కడుపులో మంటలతో బాధపడే వాళ్లకి మంచి మందులా పని చేస్తుంది*

*అంధత్వ నివారణలోనూ తోడ్పడుతుంది*

బీరకాయల్లోని పెప్టయిడ్స్, ఆల్కలాయిడ్లూ రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకూ తోడ్పడతాయి. బీరకాయలు రక్తశుద్ధికీ, కాలేయ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతాయి.

ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది. *బీరలోని మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచడంద్వారా చక్కెరవ్యాధినీ నియంత్రిస్తుంది.* బీరకాయలోని విటమిన్‌-ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని తాజా పరిశోధనలో తేలింది.

అల్సర్లు, కడుపులో మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ మందులా పనిచేస్తుంది. బీరకాయల్లోని విటమిన్‌ బి6 ఎనీమియాను నివారిస్తుంది. దీనిని ఆరేళ్లపాటు ఆహారంలో భాగంగా చేసుకున్నవాళ్లలో కంటి కండరాల క్షీణత 25 శాతం వరకూ తగ్గిందని పరిశోధనల్లో తేలింది.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *